ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సినిమాలో నటిస్తుందా? ఎవరితో?


మన హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సినిమా ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ఆమె వాటిని కొట్టి పారేస్తూ వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్స్ ని ఎ మాత్రం తీసిపోని అందం సొంతం చేసుకున్న ఆమెని తెరపై చూడాలని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె అభిమానుల ఆశలని తీర్చేందుకు సానియా మీర్జా సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం. ఈ ఏడాది సానియా మిర్జా సినిమా ఎంట్రీ పక్కా అని వినిపిస్తుంది. దీనిపై బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ కూడా క్లేరిటి ఇచ్చాడు. సానియా మిర్జా త్వరలో అతని తండ్రితో కలిసి ఓ చిత్రంలో కనిపించనుందని ఆయన తెలిపారు. అయితే దీనిపై పూర్తి క్లేరిటి ఇచ్చే ప్రయత్నం మాత్రం ఫర్హాన్ చేయలేదు. అయితే మన హైదరాబాద్ అమ్మాయి అయ్యుండి, తెలుగులో కాకుండా హిందీలో ఎంట్రీ ఇవ్వడం ఆమెకున్న తెలుగు అభిమానులు కాస్తా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.

Comments