ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

మిస్ ఇండియా రేసులో తెలంగాణా అమ్మాయి? గెలిస్తే ఆ ఇద్దరి తరువాత?

దేశంలో ప్రతి ఏటా జరిగే అందాల అందాల సుందరి పోటీల్లో చాలా మంది అమ్మాయిలు పాల్గొంటారు. ఒక్కసారి మిస్ ఇండియా కిరీటం తల మీదకి వస్తే దేశం యావత్తు ఆ అందాల రాశి మీద ద్రుష్టి సారిస్తుంది. అయితే ఈ అందాల పోటీల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడు అంతగా ప్రాతినిధ్యం ఉండదు. ఉన్న ఫైనల్ రేసులో నిలబదరు. అప్పుడెప్పుడో గద్దె సిందూర మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ సెమీ ఫైనల్ వరకు వెళ్ళింది. మరల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మిస్ ఇండియ టైటిల్ రేసులో మన తెలుగు అమ్మాయి నిలబడింది. ఈమె పేరు సిమ్రాన్ చౌదరి. ఈ మధ్య మిస్ హైదరాబాద్ కిరీటం సొంతం చేసుకొని, ఓ తెలుగు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన అమ్మడు. సినిమాలకి విరామం ఇచ్చి ఫెమినా మిస్ ఇండియాకి సిద్ధమైంది. ఇప్పుడు అమ్మడు టైటిల్ పోరులో వుంది. ఒక వేళ ఫెమీనా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకుంటే గద్దె సిందూర తర్వాత అందాల పోటీల్లో గెలుపొందిన తెలుగమ్మాయిగా నిలిచిపోతుంది.

Comments