ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

ఏపీ లో ఉండే తెలంగాణా ఉద్యోగులకి అవమానం ?

kcr1
ఉద్యమ నేతగా ఉన్న టైం లో కెసిఆర్ చెప్పిన మాటలకీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరవాత కెసిఆర్ చెబుతున్న మాటలకీ సంబంధం లేదు అనేది చాలా మంది చెబుతున్న ఆరోపణ. హామీల సంగతి పక్కన పెడితే ఉద్యమ టైం లో ఆంధ్రా లోని తెలంగాణా ప్రజలు అవమానానికి గురి అవుతున్నారు అని ఎన్నో ఆరోపణలు వచ్చేవి. కానీ ఏపీ నేతలు ఏమీ మాట్లాడేవారు కాదు. ఏపీ ప్రజలు తెలంగాణా లో ఎదురుకొంటున్న కష్టాల గురించి కూడా ఇదే పంథా నడిచేది. దీంతో.. హైదరాబాద్ మహానగరం లాంటి చోట ఆంధ్రావారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడే నాథుడే లేకుండా పోయారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా కూడా ఏపీలోని తెలంగాణ వారు తీవ్రమైన అవమానాలకు గురి అవుతున్నట్లుగా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగటాన్ని మర్చిపోకూడదు. ఆంధ్రాలో ఉన్న నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు ఏంటి? హైదరాబాద్ లోనూ.. మిగిలిన తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు అవమానాలేవీ ఎదురుకావటం లేదా? అన్నది ప్రశ్న. విడిపోయి కలిసి ఉందామన్న ఉద్యమ మాటకు భిన్నంగా తరచూ ఆంధ్రా వాళ్లను పంపించి వేస్తాం? అని కొందరు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఆంధ్రావాళ్లేనా? తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి?లాంటి మాటలు.. తెలంగాణలోని ఆంధ్రావారికి అవమానాన్ని కలిగించేలా ఉండవా? అన్నది ప్రశ్న.

Comments