ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఆ స్వామీజీ ఆమె మీద అత్యాచారయత్నం చేయలేదంట?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వామీజీ అత్యాచారం చేస్తే అతని మర్మంగాన్ని కోసేసిన యువతీ ఉదంతం ఇప్పుడో కొత్త మలుపు తిరిగింది. గతం లో ఎనిమిదేళ్ళుగా స్వామీజీ తన మీద లైంగిక దాడికి చేస్తున్నాడని. అందుకే అతని అతని మర్మాంగాన్ని కోసేసానని చెప్పిన ఆ యువతీ ఇప్పుడు మాట మార్చింది. అసలు స్వామీజీ తనపై ఎలాంటి అత్యాచారం చేయలేదని, అతన్ని తాను ఎ విధంగా గాయపరచాలేదని ఆ యువతీ స్వామీజీ తరుపు న్యాయవాదికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. స్వామీజీ నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే దాడి చేసినట్లు ఆ రోజు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చిన ఆ యువతి, ఇప్పుడు పోలీసులే తనతో అలా నాతో బలవంతంగా మాట్లడించారని ఆ లేఖలో రాసింది. ఆ లేఖని స్వామీజీ తరుపు న్యాయవాది కోర్టులో సమర్పించారు. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఆమె మాటలని అంగీకరించడం లేదు. ఆమె దేనికో భయపడి అబద్ధం చెబుతుందని. కావాలంటే నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments