ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

భయంతో వణికిపోతున్న టీం ఇండియా అభిమాని..ఏం జరిగింది..?

మన దేశంలో క్రికెట్ పట్ల అభిమానుల్లో ఉన్న పిచ్చి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన టోర్నీలలో భారత జట్టు విజయం కోసం అభిమానులు పూజలు నిర్వహించడం, ఓటమిపాలైతే ఆందోళనలు చేయడం ఇక్కడ సహజమే. ప్రపంచకప్ వంటి టోర్నీలలో భారత జట్టు విజయం సాధిస్తే కొన్ని కంపెనీలు వారి ఉత్పత్తులకు ఆఫర్ లను ప్రకటించడం కూడా చూస్తూనే ఉన్నాం. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు విజయం సాధిస్తే తన స్థాయిలో ఆఫర్ ని ప్రకటించాడు. టీం ఇండియా పాక్ పై నెగ్గితే తన కాలనీ వాసులను వారం రోజులపాటు ఉచితంగా బట్టలు ఇస్త్రీ చేసేస్తానని ప్రకటించాడు. ఆజాద్ సింగ్ అనే అతడు ఆగ్రాలోని ప్రతాప్ నగర్ లో లాండ్రీ వ్యాపారం చేస్తున్నాడు.

దీనితో ఆజాద్ కు గురువారం రాత్రి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇచ్చావని ఆజాద్ ని అతడు బెదిరించాడు. దేశంపై టీం ఇండియాపై ఉన్న ప్రేమతో అలా చేసానని చెప్పిన ఆజాద్ ఫోన్ కట్ చేశాడు. కానీ ఆరోజు రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. తనకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని విశ్వహిందూ పరిషత్ కు చెందిన రాజేద్ర అనే వ్యక్తి తెలిపాడు. దీనితో అతడిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా 2011లో టీం ఇండియ ప్రపంచకప్ గెలిచినా సందర్భంగా ఆజాద్ తన కాలనీవాసులు 15 రోజులపాటు ఉచితంగా ఇస్త్రీ చేశాడు.

Comments