ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

హనుమంత రావ్ బ్రేస్ లెట్ వేలంలో 20 లక్షలు.. ఆ డబ్బు వారికే

తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన దగ్గర ఉన్న ఒక అరుదైన బ్రేస్ లెట్ ని వేలం వేసి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఆ వచ్చిన డబ్బుతో ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఆర్థికంగా నష్టపోయిన మిర్చి రైతులకు అందజేస్తామని చెప్పారు. అయితే ఈ బ్రేస్ లెట్ వెనుక ఎవ్వరికి తెలియని ఓ విషయం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే.. జూన్ 1 న సంగారెడ్డి లో మహాగర్జనకు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సభ విజయవంతంగా జరగడానికి కారణం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని సీనియర్ నేత హనుమంత రావ్ రాహుల్ కి తెలియజేశారట. అయితే రాహుల్ సరదాగా అంత చేసిన ఆ నేతకు మీరేమిచ్చారు అని అడగడంతో వి హెచ్ నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని బదులు ఇచ్చారట.

అయితే రాహుల్ ఏమి లేదా అని హనుమంత రావ్ చేతికి ఉన్న బ్రేస్ లెట్ ని తదేకంగా చూసి నవ్వారట. దీంతో విహెచ్ మరుసటి రోజు జగ్గారెడ్డిని కలిసి తన చేతికి ఉన్న బ్రేస్ లెట్ ని అతని చేతికి తొడిగారట. అయితే ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ బ్రేస్ లెట్ ని వేలం వేసి రైతులకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నని జగ్గారెడ్డి చెప్పడంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేలంలో రూ. 5 లక్షలతో ప్రారంభమైన వేలం కాసేపటికి 20 లక్షలకు చేరుకుంది. కృషి డెవెలపర్స్ సంస్థ తరపున ఖమ్మం, వరంగల్ రైతులకు ఈ నగదును ఇవ్వనున్నారు.

Comments