ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

హైదరాబాద్ లో మహిళా సాఫ్ట్ వేర్ బలి..భర్త చేసిన దుర్మార్గం ఏమిటి..?


గచ్చిబౌలి సుదర్శన్ నగర్ లో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పద్మజ(35) అనే మహిళ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందిన ఘటన అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. పద్మజ కు గత ఏడాది ఏప్రిల్ లో టెక్ మహీంద్రా ఉద్యోగి అయిన గిరీష్ తో వివాహం జరిగింది. కాగా పద్మజ మృతి పై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం అత్తింటి వారే హత్య చేసారని ఆరోపిస్తున్నారు.

గత కొంత కాలంగా గిరీష్, పద్మజ ల వివాహ జీవితం సరిగా సాగడం లేదని తెలుస్తోంది. పద్మజ ఉరేసుకుని మరణించినట్లు కనిపిస్తున్నా ఆమె నుదిటిపై బలమైన గాయాలు ఉండడంతో అనుమానాలు కలుగుతున్నాయి. పద్మజ తల్లిదండ్రులు గిరీష్ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తెసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పద్మజ ని గిరీష్ తరచుగా కట్నం కోసం వేదించే వాడని ఆమె తల్లిందండ్రులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. దీనితో పద్మజ భర్త గిరీష్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

Comments