ప్రచురణ తేదీ : Tue, Jun 13th, 2017

రెండో ప్రపంచం యుద్ధం నాటి విమానం ఇప్పుడు కూలింది : వీడియో

ఫ్రాన్స్ లో ఊహించని విధంగా ఓ విమానం కూలిపోయి అందరిని షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే లాంగుయాన్‌ విలెట్‌ ఎయిర్‌ షో ఉత్తర ఫ్రాన్స్‌లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ యుద్ధ విమానం ఈ షోలో పాల్గొంది. దీంతో వైమానిక విన్యాసాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో సందర్శకులు ఎయిర్‌షోకి తరలివచ్చారు. అప్పటివరకు బాగానే సాగినా ఆ షో లో పాత విమానం ఒక్కటి ఒక్కసారిగా నేలకూలింది. అదృష్టవశాత్తు ఆ విమానం పేలిపోకపోవడంతో పైలెట్ ని బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ విమానం ఏ విదాంగా కూలిందో మీరు కూడా ఓ సారి వీక్షించండి.

Comments