ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

చిరంజీవి కి థాంక్స్ చెప్పిన రాజమౌళి

ss-rajamouli
పెద్ద సినిమా ఏది వచ్చినా తన మనసుకి నచ్చితే వెంటనే ట్వీట్ చేస్తారు డైరెక్టర్ రాజమౌళి. రివ్యూలు పెట్టడం ఆయనకి బాగా అలవాటు ఉన్న విషయం. ప్రతీ సినిమా దాదాపు మొదటి రోజే చూసే అలవాటు కూడా ఉంది రాజమౌళి కి. ట్విట్టర్ ఫేస్ బుక్ వేదిక గా తన అభిప్రాయం ఉంచుతారు ఆయన. ”బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గారూ వెనక్కి వచ్చేసినందుకు థ్యాంక్స్. 10 ఏళ్ళు మిమ్మల్ని చాలా మిస్సయిపోయాం. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ ప్రాజెక్టుగా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్ చరణ్. వినయ్ గారూ.. కుమ్మేశారంతే. మీకంటే ఈ సినిమాను ఎవ్వరూ బెటర్ గా హ్యాండిల్ చేయలేరు. ఖైదీ టీమ్.. హ్యావ్ ఏ బ్లాస్ట్” అంటూ తన మినీ రివ్యూ అందించాడు రాజమౌళి. ఖైదీ నెం 150 ప్యూర్ గా చిరంజీవి పునరాగమనం కోసం క్రియేట్ చేసిన ఒక ప్రాజెక్టు కాబట్టి.. రాజమౌళి కూడా అదే రేంజులో ఎక్సయిట్ అయినట్లున్నాడు.

ఇకపోతే సినిమాను చూసిన ఇతర సెలబ్రిటీలు కూడా చాలా ఎక్సయిట్ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను మరింత రంజుగా తయారుచేస్తున్నారు. అందుకే ప్రస్తుతం #BossIsBackfestival అనే హ్యాష్ ట్యాగ్ తెలుగు రాష్ట్రంలలో తెగ ట్రెండ్ అవుతోంది.

Comments