ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఆ డ్రెస్సు పై పవన్ మోజు తగ్గలేదుగా..?


పవన్ కళ్యాణ్ సినిమాలు ముగించి ఎప్పుడు పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెడతాడనే అంశం ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాక ముందే పవన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి పవన్ ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రం నవంబర్ నుంచే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రంలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటికే గబ్బర్ సింగ్, సర్దార్ వంటి చిత్రాల్లో పవన్ పోలీస్ గా నటించాడు. ఓ తమిళ చిత్రంలోని బేసిక్ లైన్ ని తీసుకుని సంతోష్ శ్రీనివాస్ తన స్టయిల్ లో కథని మార్చి రాసాడట. కాకపోతే ఈ చిత్రాని పవన్ కేవలం 55 రోజుల కాల్షీట్ లను మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ పోలీస్ గా కనిపించిన గబ్బర్ సింగ్ ఒక ఊపు ఊపగా సర్దార్ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. కాగా సంతోష్ శ్రీనివాస్ పవన్ ని పోలీస్ ఆఫిసర్ గా ఎలా చూపిస్తాడనే అంశం ఆసక్తిగా మారింది. ఈ చిత్రం తరువాత పవన్ సినిమాలను పక్కన పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Comments