ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

వివాదం లో ఇరుక్కున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్

ఇంగ్లండ్ లోని ఓవల్ లో నేటి మధ్యాహ్నం ప్రారంభం కానున్న భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు బీసీసీఐ తరపున వెళ్తున్న అతిథుల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రా కూడా ఉండడం వివాదాస్పదమైంది. ఫైనల్ మ్యాచ్ ను వీక్షించనున్న అతిధుల కోసం బీసీసీఐ 24 టికెట్లు కొనుగోలు చేసింది. దీంతో పాటు జట్టు కోటాలో భాగంగా 20 వీవీఐపీ టికెట్లు వస్తాయి. ఈ టికెట్లను బీసీసీఐ అధికారులతో పాటు అతిధులకు కేటాయిస్తుంది.

ఈ నేపథ్యంలో ఒక టికెట్ ను రాబర్ట్ వాద్రాకు కేటాయించింది. దీంతో వివాదం రాజుకుంది. రాబర్ట్ వాద్రా బీసీసీఐకి ఎప్పుడు అతిథిగా మారారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. కాగా, నేటి మ్యాచ్ ను వీక్షించే వారిలో బీసీసీఐ సిఈవో రాహుల్ జోహ్రి, బీసీసీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ సి.కె. ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరీ, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, మరో ముగ్గురు బీసీసీఐ సిబ్బంది ఉన్నారు. కాగా, వీవీఐపీ హోదా టికెట్లు కావాలంటూ పలువురు సెలబ్రిటీలు బీసీసీఐని కోరడం విశేషం.

Comments