విదేశాలకు వెళ్లాలంటే ఇక ఆ ఇబ్బంది ఉండదు

విదేశాలకు వెళ్లాలంటే తమ పేరును, జన్మించిన తేదీని, భారత్ లోని చిరునామా మరియు పాస్ పోర్ట్ నెంబర్, విమాన నెంబర్ వంటి వివరాలను తప్పనిసారిగా డిపార్చర్ కార్డులో నింపాల్సి ఉండేది. దీంతో ప్రయాణికులు ఒక్కోసారి చాలా ఇబ్బందిపడే వారు. ఇమ్మిగ్రేషన్ కు సంబందించిన వివరాలను నింపే ప్రక్రియలో చాలా సమయం పట్టేది. దీంతో ఈ విధానానికి చాలా మంది వ్యతిరేకత చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి విమానాల్లో వెళ్లే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేకుండా డిపార్చర్ కార్డులు నింపాల్సినవసరం లేదని పేర్కొంది. ఈ విధానాన్ని వచ్చేనెల జులై ఒకటి నుండి భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయలలో రద్దు చేయనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కానీ రైళ్లలో , నౌకల్లో విదేశాలకు వెళ్లేవారికి మాత్రం ఎంబార్కేషన్ కార్డును తప్పకుండా నింపాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Comments