ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

సైరట్ సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసుడు మోక్షజ్న?


మరాఠి చిత్రం సైరట్ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నాగరాజు ముంజలె దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించబడి. మరాఠి సినిమా చరిత్రలో ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ రైట్స్ ని రాక్ లైన్ వెంకటేష్ సొంత చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నందమూరి ఫాన్స్ మొత్తం ఆనందించే వార్త కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్న సినిమా ఎంట్రీ కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్న త్వరలో ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ కూడా కాన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలో ఎంట్రీ త్వరలోనే ఉంటుందని వార్త వినిపిస్తుంది. అది కూడా మరాఠి బ్లాక్ బస్టర్ మూవీ సైరట్ రీమేక్ తో మోక్షజ్న ఎంట్రీ ఉంటుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాని భారీ స్థాయిలో మోక్షజ్న తో రీమేక్ చేసే ఆలోచనలో ప్రొడ్యూసర్ ఉన్నట్లు అందరు చెప్పుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకి కొత్త దర్శకుడు కాకుండా లవ్ స్టొరీలు తీయడంలో దిట్ట అయిన ఓ సీనియర్ దర్శకుడు చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టినట్లు కూడా వార్త వినిపిస్తుంది. అయితే ఇందులో నిజమెంత అనే విషయం నిర్మాతగాని, ఇటు బాలకృష్ణ గాని చెబితే గాని తెలియదు.

Comments