ప్రచురణ తేదీ : Tue, Sep 22nd, 2015

స్నేహానికి మతం అడ్డురాదంటూ.. ఆ ముస్లిం యువకుడు!

musim-friend
మతం, మతాచారాలు అనేవి మానవత్వానికి, స్నేహానికి అడ్డురావంటూ ఓ ముస్లిం యువకుడు తను చేసిన ఓ గొప్ప పని ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆ ముస్లిం యువకుడు అనారోగ్యంతో మరణించిన తన హిందూ మత స్నేహితుడికి హిందూ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేసి ఆదర్శప్రాయుడయ్యాడు.

వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్ లోని బైతుల్ జిల్లాలో సంతోష్ సింగ్ థాకూర్ అనే కార్మికుడు అనారోగ్యంతో మరణించాడు. అయితే, సంతోష్ కు భార్య, చిన్న పిల్లలు తప్ప ఇతర బంధువులు ఎవరూ లేకపోవడంతో సంతోష్ కు అంత్యక్రియలు చేయడానికి దగ్గరివారంటూ లేకపోయారు. అయితే సంతోష్ కు రిక్షా వాలా అబ్దుల్ రజాక్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఈ నేపధ్యంలో సంతోష్ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన రజాక్ హిందూ సాంప్రదాయం ప్రకారం స్నేహితుడి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ సందర్భంగా రజాక్.. సంతోష్ కు నివాళి అర్పిస్తూ తమ స్నేహం మతం ప్రాతిపదికన ఏర్పడలేదని, స్నేహితుడిగా తన బాధ్యతను నిర్వర్తించానని తెలిపాడు.

Comments