పక్కా ప్లాన్ తో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో బాలికపై అత్యాచారం


మహారాష్ట్రలో నాగపూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో ఓ బాలికపై సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా అక్కడి ప్రజలను భయానికి గురిచేసింది. అత్యాచారానికి పాల్పడిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో బాలికపై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. క్వార్టర్స్‌ లోని గది నెంబర్ 320 లో ఓ 17 ఏళ్ల బాలికపై నగల షాపు యజమాని తో పాటు అతని అనుచరులు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఆ బాలిక కూడా ఆ షాపులోనే పనిచేస్తుంది. దీంతో తెలిసిన వారే కదా అని వెళ్లిన ఆ అమాయకురాలి పై అతిదారుణంగా ఆ యజమాని హత్యాచారానికి పాల్పడడంతో మహిళా సంఘాలు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టాయి. నిత్యం బందోబస్తుతో ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో ఒక్క పొలిసు కూడా ఈ దారుణాన్ని ఆపకపోవడం అమానుషమని వారు మండిపడ్డారు. అయితే ఆ క్వార్టర్స్‌ లో ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండరు కేవలం వారి ప్రతినిథులు, అనుచరులు మాత్రమే ఉంటారు. పోలీసులు కూడా అంతగా అక్కడ ఉండరు. దీంతో దీనినే అనువుగా చేసుకొని ఆ బాలికను అక్కడికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే నేరానికి పాల్పడిన ఆ షాపు యాజమానిపై అలాగే అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Comments