ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

పెళ్ళైన తర్వాత కూడా మరో మగాడితో సంబంధం పెట్టుకోవడం సంస్కారమేనా మహిళ?

నాగరిక సమాజంలో మనిషి ఆలోచనలు ఒకప్పటి అనాగరిక లక్షణాలని మరల గుర్తుకు తెస్తున్నాయి. స్వేచ్చ కోసం రోడ్డుపైకి వస్తున్నా స్త్రీలు శారీరక సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. పెళ్లై భర్త వున్న వివాహిత కూడా వేరే మగాడి పొందు కోసం పరితపిస్తుంది. మగాడితో సమానత్వం కోరుకునే ఆడది కేవలం ఉద్యోగాల్లోనే కాదు క్రూరమైన ఆలోచనల్లో కూడా మగాడితో తాను సమానం అని చూపించుకుంటుంది. ఇంట్లో భర్తకి తన భార్య చాలా మంచిది. ఉత్తమ ఇల్లాలంటే ఇలాగే వుంటుంది అని చెప్పుకుంటాడు.

కాని ఎదో ఒక రోజు ఆమె బండారం బయటపడుతుంది. అంత వరకు ప్రేమించిన భర్త అసహించుకోవడం మొదలుపెడతాడు. దూరం పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆడవారిలో పైశాచికం బయటకు వస్తుంది కట్టుకున్న, కొన్నేళ్ళు తనతో కాపురం చేసిన భర్త అనే ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా ప్రియుడుతో కలిసి చంపేస్తుంది. తరువాత ఎవరో తన భర్తని చంపేశారని పెద్ద డ్రామా ప్లే చేస్తుంది. కాని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చేసిన నేరం ఇప్పటికి దాగిపోదు. ఎదో ఒక రోజు ఆధారాలతో సహా దొరికిపోతుంది అప్పుడు చేసిన తప్పున ప్రియుడుతో కలిసి జైలు గోడల మధ్యకి వెళ్తుంది.

అయిన ఆడవాళ్ళ బుద్దులు మారడం లేదు. వరకట్నం వేధింపులు ఎక్కువైపోయాయని గగ్గోలు పెడుతున్న మహిళా సంఘాలకు పెళ్ళాలు చేసే పాశవికమైన ఘోరాలు ఎందుకు కనిపించడం లేదు. స్వేచ్చ కోరుకున్న ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎం చేస్తున్నారంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తే ఒకటి ప్రియుడుతో శారీరక సంబంధానికి అడ్డుగా వున్నారని పిల్లలని చంపేయడం, భర్తే అడ్డుగా వుంటే అతన్ని చంపేయడం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధంతో అడ్డంగా దొరికిపోయిన పెళ్ళాల ప్రవర్తన మారక కోపంతో మొగుడే యుముడుగా మారి పెళ్ళాన్ని, తన ప్రియుడుని కలిపి చంపేసిన సంఘటనలు కూడా ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన శిరీష ఆత్మహత్య ఉదంతం తీసుకుంటే చాలా రహస్యాలు వెలుగు చూసాయి. ఆమె భర్తకు కూడా తెలియకుండా తాను పని చేస్తున్న ఫోటోగ్రాఫర్ రాజీవ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ఆ సంబంధం రాజీవ్ ప్రేయసి తేజస్విని తో గొడవకు కారణం అయ్యింది. తరువాత శిరీష ఆత్మహత్యకి దారితీసింది. ఈ ఉదంతంలో శిరీష భర్తకి ఆమె గురించి పోలీసులు ఇన్ని వాస్తవాలు చెప్పినంత వరకు తెలియక పోవడం. ఇద్దరు పిల్లలు, భర్త ఉన్న కూడా శిరీష రాజీవ్ తో వివాహేతర సంబంధం కొనసాగించడంలో ఏమిటి అనేది ఆమెకు మాత్రమె కాదు. పెళ్ళైన మరో మగాడితో భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ప్రతి భార్య ఆలోచించుకోవాలి. భర్తతో కలిసి బ్రతకడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవడం ఉత్తమం. అలా కాకుండా భర్త కలిసుంటూ వేరొక మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఆ విషయాన్ని ప్రతి మహిళ తెలుసుకోవాలని ఆని అందరు కోరుకుంటున్నారు.

Comments