ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

లండన్ లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న మగాడు…!

pragnency
మనం చాలా సంవత్సరాల క్రితం చూసిన ‘జంబలకిడిపంబ’ సినిమా గుర్తుందా..? అందులో ఆడవాళ్లు మగవాళ్ల లాగా, మగవాళ్ళు ఆడవాళ్ళ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు ఆ సినిమాలో మగవాళ్లకు కడుపులు కూడా వచ్చినట్టు చూపించారు. ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాలో కథ లండన్ లో నిజం కాబోతుంది. సృష్టి ధర్మం తిరగబడుతుంది.

అసలేం జరిగిందంటే లింగ మార్పిడితో పురుషుడిగా మారుతున్న 20 ఏళ్ల హేడెన్ క్రాస్ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు. ప్రసవంతో బ్రిటన్ లో బిడ్డకు జన్మ ఇవ్వనున్న తోలి పురుషుడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్ మూడు సంవత్సరాల నుండి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ చికిత్స కూడా చేయించుకున్నాడు. భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా దానికి 4వేల పౌండ్లు ఖర్చు అవుతుందని, దానిని తాము భరించలేమంటూ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది. దీంతో అతను పేస్ బుక్ ద్వారా వీర్య దాతను కనుక్కొని గర్భం దాల్చాడు. బిడ్డను కని తాను మంచి నాన్నను అవుతానని హేడెన్ అంటున్నాడు.

Comments