తాళి కట్టిన చేతులతోనే తల తీసేశాడు.. ఆ తరువాత ?

లక్షల కట్నం ఇచ్చి ఒక్కగానొక్క కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన తల్లి తండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించమని అనుకున్నారు. కూతురికి ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేశామని ఎంతో సంతోషంతో ఉవ్వెత్తున ఉప్పొంగిపోయారు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గాని పెళ్లి చేసిన అయిదు రోజులకే కూతురు కనిపించలేదు. ఏం జరిగిందో అని ఆ యువతీ తల్లి తండ్రులు పెళ్లి కొడుకును అడగగా ఏమో ఎటుపోయిందో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు పెళ్లి చేసుకున్న యువకుడు. దీంతో ఏమైందో తెలియని తమ కూతురి జాడ కోసం గాలించిన ఆ యువతీ తల్లి తండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా పెళ్లి చేసుకున్న భర్తే ఆ యువతిని చంపేశాడని నిర్దారించారు. పెళ్లయిన అయిదు రోజులకే భార్య గొంతు కోసి మొండాన్ని అతని ఇంటికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికికాలువలో పడేశాడు. తలను మాత్రం ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి షాపూర్- నాసిక్ రోడ్డులో ఉన్న అడవుల్లో పడేశాడు. ఆ తరువాత నిర్దారణ కోసం శవం తాలూకు గుర్తులను తల్లి తండ్రులకు చూపించగా ఆ శవం తం కూతురిదేనని బోరున విలపించారు. అయితే కట్టుకున్న భర్తే హత్య ఎందుకు చేశాడు అనేది ఇంకా తెలియాల్సి ఉండాగా.. ఈ హత్యలో ఆ యువకుడి తల్లి తండ్రులుగా కూడా ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు తెలియజేశారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.

Comments