ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

హాట్ టాపిక్‌: ప‌వ‌న్ కోసం కాపు కాసిన మ‌హేష్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లోని క్రేజీ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎట్టి ప‌రిస్థితిలో సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేసి ద‌స‌రా బ‌రిలో దించేయాల‌న్న‌ది టీమ్ ప్లాన్‌. ద‌స‌రా సెల‌వుల్ని క్యాష్ చేసుకునేందుకు.. సెప్టెంబ‌ర్ 21 న రిలీజ్ చేసే ఆలోచ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఉంది. అయితే అప్ప‌టికి ఈ సినిమా పూర్త‌వుతుందా ప‌క్కాగా అన్న‌ది తేలలేదింకా. రిలీజ్ తేదీ ఫ‌లానా అని ప్ర‌క‌టించాకే టైటిల్ నిర్ణ‌యించాల‌ని ప‌వ‌ర్‌స్టార్ ఇదివ‌ర‌కే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఆర్డ‌ర్ వేశారు.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ 25 వ సినిమా రిలీజ్ తేదీ డైలెమ్మా.. స్పైడ‌ర్ రిలీజ్‌కి అడ్డంకిగా మారిందిట‌. ప‌వ‌న్ రిలీజ్‌ని బ‌ట్టి స్పైడ‌ర్ రిలీజ్ ప్లాన్ చేయాల‌న్నది ఆ టీమ్ ఆలోచ‌న‌. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ 27న స్పైడ‌ర్ రిలీజ్ అంటూ ఇదివ‌ర‌కే ప్ర‌చార‌మైంది. అయితే అదే తేదీకి రావాలా? లేక ఇంకో వారం ముందే వ‌స్తే బావుంటుందా? అన్న డైలెమ్మా ఉంది. ప‌వ‌న్ సినిమా సెప్టెంబ‌ర్ 21న రాకుండా వాయిదాకి వెళితే.. త‌ప్ప‌కుండా ఈ తేదీనే లాక్ చేసేందుకు స్పైడ‌ర్ టీమ్ కాపు కాసుకు కూచుందిట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. రిలీజ్ డైలెమ్మా కొన‌సాగుతోంది. ఇది స్పైడ‌ర్ రిలీజ్‌కి ఆటంకంగానే మారింది. ఇక‌పోతే స్పైడ‌ర్ చిత్రాన్ని కోలీవుడ్, బాలీవుడ్‌లో క‌చ్ఛితంగా సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తేనే బావుంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అక్క‌డ సెప్టెంబ‌ర్ 27 ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఉండ‌బోతోందిట‌. అంటే సెప్టంబ‌ర్ 21కే తెలుగులోనూ రావాల్సి ఉంటుంది. అదీ సంగ‌తి.

Comments