ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

పేద‌వాడికి గృహ రుణాలు.. ఈ క‌న్ఫ్యూజ‌నేంటి?

డీమానిటైజేష‌న్ ఎందుకు? అంటే ఒకానొక ద‌శ‌లో పేదోడి సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకే అంటూ కేంద్రం డ‌బ్బాలు కొట్టింది. అయితే అది డ‌బ్బాలు కొట్ట‌డం కాదు నిజ‌మే అని నిరూపించేందుకా అన్న‌ట్టు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టే అనిపిస్తోంది. ఇక ఏపీకి ల‌క్ష‌న్న‌ర పైగా పేద‌ల‌కు సొంత ఇంటి క‌ల నెర‌వేర్చేందుకు గ్రాంట్లు ఇచ్చేందుకు నిర్ణ‌యించుకుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దిల్లీ నుంచి ఆ వార్త అందడం చెవికి ఇంపైన‌దే కానీ.. అయితే ఇందులో ఓ క‌న్ఫ్యూజ‌న్ ఉంది.

1.50 ల‌క్ష‌లు కేంద్రం సాయం చేస్తుంది. మిగ‌తాది బ్యాంకు రుణం రూపంలో అందుతుంది అంటూ చంద్ర‌బాబు చెబుతున్నారు. వాస్త‌వానికి బ్యాంకులు గృహ‌రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గించాయ‌ని చెబుతున్నా.. ఎంత త‌గ్గించాయి? అన్న‌ది ఇప్ప‌టికీ సామాన్యుల‌కు అర్థంకాని వ్య‌వ‌హారంగా మిగిలింది. గ‌తంతో పోలిస్తే బ్యాంకుల నిండా క‌రెన్సీ వ‌చ్చి చేరింది. కానీ ఆ మేర‌కు విత‌ర‌ణ మాత్రం జ‌రుగుతున్న జాడ‌లు క‌నిపించ‌డం లేదు. లోన్లు ఇస్తాం అని మాత్రం ఊక‌దంపుడు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ ఇప్ప‌టికీ బ్యాంకుల‌కు వెళితే పేద‌ల్ని ప‌ట్టించుకునే అధికారులే క‌న‌ప‌డ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అస‌లు జ‌నాల‌కు విస్త్ర‌త‌మైన స‌మాచార‌మే గృహ‌రుణాల‌పై లేదు. బ్యాంకులు మెసేజ్‌లు పెట్టి స‌రిపుచ్చుకోవ‌డ‌మే కానీ, ఊరూ వాడా తిరిగి. .. గొడుగులు వేసి వాటిపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ రుణాలు మంజూరు చేసే సీన్ క‌నిపించ‌డం లేదు. గృహాల‌కు రుణం ఇప్పిస్తాం అని అంటున్నారు. ఏ కంపెనీలో ప‌ని చేస్తున్నారు. జీతం 25 వేలు వ‌స్తుందా? అన్ని ఆధారాలు ఇవ్వండి రిట‌ర్నులు ఎలా చెల్లిస్తారో.. ఇలాంటి కండిష‌న్లు పెడితే .. ఇక పేద‌లు ఇల్లు క‌ట్టుకున్న‌ట్టే. వారి స్థాయికి త‌గ్గ రుణ ఏర్పాటు.. చేసి ఇల్లు క‌ట్టుకేనేందుకు మాన‌వ‌తా సాయం చేయ‌క‌పోతే ఇల్లు లేని పేద‌లు ఇక ఎప్ప‌టికీ అలానే మిగిలిపోవాల్సిందే.

Comments