ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

గత 60 ఏళ్ల పాలనలో తెలంగానకు ఏమి తేలేదు..ఇప్పుడు 338 కోట్లతో.. : కేటీఆర్

నేరేడ్‌మెట్‌ (సైనిక్‌పురి)లోని జలమండలి కార్యాలయంలో తాగునీటి పథకాలను రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. 338 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అయితే ఈ సమావేశంలో కేటీఆర్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానాన్ని ఇస్తూ.. మాటలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు చేసిన దరిద్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం వదిలిస్తుంది. గత పార్టీల 60 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏ విధమైన పథకాలను తేలేదు. ముఖ్యంగా టీడీపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రము వచ్చిన తరువాత తెరాస ప్రభుత్వంలో ప్రజలకు అనేక పథకాలు అమలవుతున్నాయని కేటీఆర్ అభివర్ణించారు. ఈ సందర్బంగా తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అందుకు కేద్రం ఇచ్చిన సర్టిఫికెట్ లే రుజువని మంత్రి తెలియజేశారు.

Comments