ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

రణబీర్ తో డేటింగ్ బోర్ కొట్టింది అంటున్న కత్రినా?


బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకుంటారో, ఎందుకు విడిపోతారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలా మరో జంట గత కొంత కాలంగా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసారు. వాళ్ళు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. సల్మాన్ తో విడిపోయిన తర్వాత కత్రినా రణబీర్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది. ఇద్దరు కలిసి కొంత కాలంగా ఒకే ఇంట్లో ఉన్నారు . వీళ్ళ అనుబంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రేమ కి బ్రేక్ పడిపోయింది. వీళ్ళిద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. తాజాగా వీళ్ళు నటించిన జగ్గా జాసూస్ త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సందర్భంగా కత్రినా తన బ్రేక్ అప్ స్టొరీని మీడియాతో చెప్పినట్లు తెలుస్తుంది. రణబీర్ తో కలిసి బ్రతకడం, కలిసి నటించడం చాలా కష్టమని, అందుకే ఇకపై అతనితో ఎలాంటి రిలేషన్ కొనసాగించకూడదని డిసైడ్ అయ్యానని చెప్పినట్లు తెలుస్తుంది. అతనితో తన రిలేషన్ చాలా బోరింగ్ గా వుందని . అందుకే ఫుల్ స్టాప్ పెట్టేసి , సినిమాల మీద ద్రుష్టి పెట్టె ఆలోచనలో చెప్పిందని అందరు అనుకుంటున్నారు.

Comments