ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

అతడితో చచ్చినా సినిమా చేయనని చెప్పేసిన కత్రినా..సెట్ లో ఏం చేశాడో..!


మాజీ ప్రేమపక్షులు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ లు ఇక జీవితంలో కలసి నటించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రేమికులుగా విడిపోయిన వీరు ఇక నటులుగా కూడా విపోయినట్లే అని సంకేతాలు అందుతున్నాయి. వీరిద్దరూ ఆ మధ్యన ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీచ్ లెమ్మట బికినీలేసుకుని రణబీర్ తో కత్రినా తిరిగింది. దానికి సంబందించిన ఫోటోలు కూడా నెట్ లో వైరల్ గా మారాయి. అప్పట్లో వీరి ప్రేమ గురించి బాలీవుడ్ మొత్తం కోడై కూసింది. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయింది. ఆ తరువాత ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేసిన రణబీర్ వాళ్ళ ఇంట్లో కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువతిది లండన్ అని సమాచారం.

ఇక కత్రినా, రణబీర్ లు కలవరని అంతా అనుకున్నారు. అనూహ్యంగా జగ్గూ జాసూస్ అనే చిత్రం లో వీరిద్దరూ నటించడానికి అంగీకరించారు. ప్రేమ పోతే పోయింది.. ఈ చిత్రం ద్వారా స్నేహితులుగా అయినా ఉంటారని అంతా భావించారు. కాగా ఈ చిత్రం సమయంలో వీరి మధ్య మళ్లీ గొడవ జరిగినట్లు కత్రినా మాటలను బట్టి అర్థమవుతోంది. తాను ఇక జీవితంలో రణబీర్ తో కలసి నటించనని కత్రినా తెగేసి చెప్పేసింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో నాతో కలసి ఇక నటించనని రణబీర్ అన్నాడు. ఆ మాట అన్న తరువాత అతడితో నటించడం చాలా కష్టంగా అనిపించింది. ఇక జీవితంలో అతడితో నటించకూడదని నిర్ణయించుకున్నా అంటూ కత్రినా సంచలన వ్యాఖ్యలు చేసింది.

Comments