ప్రచురణ తేదీ : Tue, Jun 20th, 2017

పవన్ కళ్యాణ్ ఆ సినిమానే లాస్ట్ అయ్యేలా ఉంది ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకోసం గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా దీపావళికి విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఇప్పటికే నిర్మాత ఏ ఎం రత్నం నిర్మించే సినిమాలో జులై నుండి పాల్గొంటాడు .. దాంతో పాటు అయన వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు, పక్క మాస్ ఎంటర్ టైనర్ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు .. దాంతో పాటు కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లేటెస్ట్ గా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పాడని, ఈ సినిమాకోసం కేవలం 50 రోజులే కాల్షీట్స్ ఇచ్చాడని టాక్. అంటే అయన 2018 వరకు ఈ మూడు సినిమాలను పూర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా వినాయక్ సినిమా పై క్లారిటీ రాలేదు .. అయితే సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుందట. ఇది పవర్ ఫుల్ పోలీస్ కథ అని టాక్ ? గబ్బర్ సింగ్ లో పోలీస్ గా నటించి దుమ్ము రేపాడు కాబట్టి పవన్ కు పోలీస్ పాత్రతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు … ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలనీ చెప్పాడట .. దాంతో సినిమాలకు అయన పులిస్టాప్ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ? విషయం పై పవన్ నిర్ణయం వెలువడేవరకు ఆగాల్సిందే.

Comments