ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

తల్లి కావడానికి తొందర పడుతున్న సమంత? ఎందుకో తెలుసా?


మన స్టార్ కథానాయిక సమంత త్వరలో అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్తుంది. ఇప్పటికే ఆమె నాగ చైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఎప్పుడు ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుదామా అనే ఆనందాన్ని అనుభవిస్తూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంది. తాజాగా ఆమె ఓ కామెంట్ ఇండస్ట్రీ జనాలకి కాస్తా ఆసక్తి రేకెత్తించింది. ఫిలిం ఫేర్ అవార్డ్ గురించి ప్రస్తావిస్తూ, పిల్లలు పుట్టాక వాళ్ళు, నాన్నని స్టార్ గా చూస్తారు. మరి సినిమాలో ఉండి నువ్వేం సాధించావ్ అని అడిగితే చూపించుకోవడానికి అవార్డ్స్ ఉండాలిగా అంది . దీనిపై ఇప్పుడు అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. సమంత అప్పుడే కలలో పిల్లల్ని కనేసి, వాళ్లకి పేర్లు కూడా పెట్టేసుకొని చాలా జీవితం ఊహించుకుంటుందని అనుకుంటున్నారు. నిజానికి సమంత కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకి సేవ చేస్తుంది. ఆమె మాటలు వింటూ వుంటే పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి వీలైనంత వేగంగా పిల్లని కనేసి వారితో ఆడుకోవడానికి జీవితం అంతా స్పెండ్ చేసేలా వుంది.

Comments