ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

రొమాన్స్ కి నేను రెడీ కాకపోతే కండిషన్స్ అప్లై అంటున్న పూజా హెగ్డే?


తెలుగు సినిమాల్లో కూడా ఈ మధ్య రొమాన్స్ పాళ్ళు కాస్తా శ్రుతి మించుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు వర్ధమాన కథానాయకులు సైతం తెలుగు సినిమా అంటే ఎదో పద్ధతిగా వుంటుంది అనే ఫీలింగ్ తో కాకుండా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా, అన్నింటికీ సిద్ధమయ్యే వస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అన్నింటికీ రెడీ అని చెప్పి ఇప్పుడు తెలుగులో పెద్ద ఆఫర్స్ పట్టేస్తుంది అని అందరు అనుకుంటున్నారు. తెలుగులో ముకుందా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పద్ధతైన అమ్మాయిగా కనిపించిన పూజా తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో మొహెంజదారో అనే డిజాస్టర్ సినిమాలో చేసింది. అందులో హృతిక్ తో ఫుల్ రొమాంటిక్ సీన్స్ కూడా చేసేసింది. అంతకు ముందే తెలుగులో చిన్న దాన నీ కోసం అని నాగ చైతన్యతో చేసిన సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఎలా అయిన టాలీవుడ్ లో జెండా పాతేయాలని కృత నిశ్చయంతో వుంది . ఇప్పుడు అల్లు అర్జున్ డీజేలో హీరోయిన్ గా చేస్తూ, ఇండస్ట్రీలో పెద్దల ద్రుష్టి తన మీద పడేలా చేసుకుంటుంది. అలాగే రొమాంటిక్, హాట్ సీన్స్ కూడా తాను సిద్ధమే అని, ఆ విషయంలో తనకు హద్దులు లేవని అందరికి సంకేతాలు ఇస్తుందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమాకి పూజాని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏంటి అనేది ఆమెనే చెప్పాలి.

Comments