ప్రచురణ తేదీ : Tue, May 23rd, 2017

భారతీయుల సంస్కారం ఎంటో అందరు తెలుసుకోండి.

భారతీయుల సంస్కారం గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు తెలిసిన వారు విదేశాలు వెళ్తే ఇప్పటికి మన సంప్రదాయాన్ని వారికి చాటి చెబుతూ వుంటారు, ఇప్పడు అలాంటి సంఘటన ఒకటి రీసెంట్ గా జరిగింది. అమెరికాలో చదువుకుంటున్న ఒక భారతీయ విద్యార్ధి, కాలేజీ స్నాతకోత్సవం సందర్భంగా పట్టా అందుకున్నాడు. ఈ సందర్భంగా డిగ్రీ పట్టా ఇచ్చిన అమెరికన్ దీన్ పాదాలకు నమస్కరించాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేసారు. ఆ ఫోటో ని భారతీయలు షేర్ చేస్తూ ఇండియన్ సంస్కారం ఎంత గొప్పదో చూడండి అంటూ కామెంట్స్ చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ప్రముఖులు సైతం గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా ఇండియా అంటే ఇండియానే.

Comments