ప్రచురణ తేదీ : Wed, May 24th, 2017

అమెరికా లో ముప్పై వేల మంది ఇండియన్ లు అక్రమంగా ఉంటున్నారు


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మా దేశం లో ఉండకండి రా అంటే మన భారతీయులు అక్రమంగా కూడా ఉంటున్నారు. గతేడాడు చాలా మంది భారతీయులు అమెరికా లో అడుగు పెట్టగా దాదాపు ముప్పై వేల మంది అక్రమంగా ఉంటున్నారు అని గుర్తించింది అక్కడి ప్రభుత్వం . హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం నివేదిక ప్రకారం గత ఏడాదిలో 50 మిలియన్లకు పైగా వలస కార్మికేతరులు అమెరికాకు చేరుకున్నారు. వీరిలో 739478 మంది అక్రమంగా అమెరికాలోనే ఉండిపోయారని అంచనా. భారతీయుల విషయానికి వస్తే గత ఏడాది భారత్ నుంచి 1.4 మిలియన్ల మందికిపైగా వచ్చారు. వీరిలో 30 వేల మంది అమెరికాలోనే వుండిపోయారు. 6 వేల మంది భారతీయులు మాత్రమే వీసా గడువు తీరిపోయిన తరువాత స్వదేశానికి చేరుకున్నారు. గడువు తీరినా అమెరికాలో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది.

Comments