ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

పాకిస్థాన్ కు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలన్న మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్

pak
ఇటీవల పాకిస్థాన్ ఆస్ట్రేలియాతో ఆ దేశంలోనే మూడు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ మూడు టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ అయిన పాకిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మండిపడ్డాడు. ఆసీస్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు ఆడడం రాకపోతే ఇంట్లోనే కూర్చుని ఉండడం మంచిదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగుసార్లు వైట్ వాష్ అయిందని, మూడేసి మ్యాచ్ ల సిరీస్ లను నాలుగుసార్లు కోల్పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని,ఆలా మెరుగుపరచుకోలేకపోతే పర్యటనలన్నీ పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోవాలని ఆయన సూచించారు. ఎప్పుడూ చెత్త ప్రదర్శనలు చేసేటప్పుడు పర్యటనలకు ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఆడడంలో ఎప్పుడూ విఫలం అవుతుందని ఆయన విమర్శించారు. ఈ సిరీస్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా చెత్తగా ఉందని ఆయన అన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ను చూసి ఆ జట్టు సభ్యులు ఏ విధంగానూ స్ఫూర్తి పొందినట్టు కనబడడంలేదని, ఆ జట్టులో మార్పులు తక్షణావసరమని ఆయన గుర్తు చేశారు. కనీస పోరాటం కూడా చేయని పాకిస్థాన్ జట్టును పర్యటనలకు పిలవకపోవడం మంచిదని ఆయన అన్నారు.

Comments