ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

హైదరాబాద్ లో హ్యుందాయ్ డిజిటల్ షో రూమ్.. దేశంలోనే రెండవది

హైదరాబాద్ లో హ్యుందాయ్ డిజిటల్ షోరూమ్ ను ప్రారంభించారు ఆ సంస్థ ఎండీ, సిఇఓ వైకే కూ. 2017 లో గ్రాండ్ ఐ10, యాక్సెంట్ లను ప్రవేశపెట్టిన హ్యుందాయ్ మంచి పేరును సంపాదించింది. దీంతో కంపెనీ కొనుగోలు దారులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా మరింత ఈజీగా ఉండేలా కార్ల వివరాలను తెలియజేయడానికి షో రూమ్ ను ప్రారంభించింది. దేశంలోనే రెండవ డిజిటల్ షో రూమ్ ను ఆ సంస్థ సిఇఓ కెపి హెచ్ బి కాలనిలో ప్రారంభించారు. దీనితో పాటు మారో సాధారణ షోరూమ్ ను లక్ష్మి హ్యుందాయ్ ఆధ్వర్యంలో ఎల్ బి నగర్ లో స్థాపించారు. ఈ వేడుకలో హ్యుందాయ్ సిఇఓ తో పాటు లక్ష్మి హ్యుందాయ్ సిఎండి రామ మోహన రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైకే కూ మాట్లాడుతూ.. దేశంలో హ్యుందాయ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోందని, హైదరాబాద్ నగరంలో హ్యుందాయ్ కంపెనీ కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు ఈ షోరూమ్ లు చాలావరకు ఉపయోగపడతాయన్నారు. అదే విధంగతా దేశంలోనే 479 వ షోరూమ్ ను ఈ సంస్థ స్థాపించడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మి హ్యుందాయ్ సిఎండి రామ మోహన్ రావ్ చెప్పారు. అలాగే కొత్త షోరూమ్ లు హ్యుందాయ్ వాహనదారులకు వీలైనంత త్వరగా సర్వీసింగ్ సేవలను అందించడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.

Comments