ప్రచురణ తేదీ : Thu, Jan 5th, 2017

తెలంగాణా సర్కారు కి హై కోర్టు ఊహించని షాక్ :

high-court
అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైం లో తెలంగాణా ప్రభుత్వానికి హై కోర్టు లో షాక్ తగిలింది. జీవో నెంబర్ 123 ద్వారా భూములు తీసుకోవద్దు అని సర్కార్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హై కోర్టు. వివిధ సాగునీటి ప‌థ‌కాల కోసం ప‌లు జిల్లాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో కాకుండా జీవో నెంబ‌రు 123ను తీసుకొచ్చి దాని ద్వారానే భూముల‌ను సేక‌రించిన విష‌యం తెలిసిందే. దీని ప‌ట్ల తీవ్ర అభ్యంతరాలు వ్య‌క్తం చేస్తూ వంద‌ల మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. కొన్ని నెల‌లుగా ఈ కేసులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. అధికారులు బ‌ల‌వంతంగా భూములు లాక్కుంటున్నార‌ని రైతుల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో వాదించిన‌ట్లు తెలుస్తోంది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో భూమి సేక‌రిస్తే ఎటువంటి అభ్యంత‌రాలు ఉండ‌బోవ‌ని తెలిపింది. ఈ కేసులో ఇంకా వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

Comments