ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

ఎన్టీఆర్ సినిమాలో అనవసరంగా చేశానంటున్న ప్రముఖ హీరో

navdeep
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ సినిమాతో పరిచయం అయిన యువ హీరో నవదీప్ ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ అనే సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. క్యారెక్టర్ నచ్చితే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలను కూడా ఒప్పుకున్నాడు. ఆలా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో అతను నటించిన ‘ఆర్య-2’ అతనికి చాలామంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత కూడా అలాంటి పాత్రలు రెండు, మూడు చిత్రాల్లో చేసాడు.

అయితే అతను తాను నటించిన ‘బాద్షా’ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసాడు. ‘బాద్షా’ సినిమా లో ఎన్టీఆర్ పక్కన విలన్ గా చేసి ఉండాల్సింది కాదని అంటున్నాడు. స్క్రిప్ట్ దశలో ఉండగా తన కెరెక్టర్ బాగా ఎలివేట్ అవుతుందని తాను భావించానని, అయితే స్క్రీన్ పై చూసుకున్నాక ఈ చిత్రం అనవసరంగా చేసానేమో అని అనుకున్నానని నవదీప్ అంటున్నాడు. తాను విలన్ పాత్రలకు బదులుగా ‘ఆర్య-2’ లో చేసినట్టు నెగటివ్ టచ్ ఉన్న రోల్స్ చేస్తే బాగుంటుందని అన్నాడు.

Comments