ప్రచురణ తేదీ : Fri, May 26th, 2017

ఇద్దరు మిత్రులు కలిసి వెళ్ళారు…అంతలో గొడవ! తరువాత జరిగింది?

ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వారితో వారిలో ఒకడు గొడవ పడ్డాడు. అయితే ఆ గొడవలో రెండో వాడు సపోర్ట్ గా రాలేదని ఆ మిత్రుడుని పొడిచి చంపేసాడు. వివరాల్లోకి వెళ్తే. మధు విహార్ ప్రాంతానికి చెందిన సాజిద్ (23) గత రాత్రి కొందరు స్థానికులతో చిన్న విషయమై గొడవపడుతున్నాడు. ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న స్నేహితుడు బాబు, ఆ గొడవను పట్టించుకోకుండా కొంత దూరంలో నిలబడి వున్నాడు. గొడవ ముగిశాక బాబు దగ్గరికి వచ్చిన సాజిద్ గొడవ జరుగుతుంటే తనకు మద్దతుగా ఎందుకు రాలేదని నిలదీశాడు. అయితే బాబు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని సాజిద్ పట్టరాని కోపం తో తన దగ్గర వున్న కత్తితో స్నేహితుడిని పొడిచి చంపేశాడు. అయితే మృతుడిని గుర్తించిన పోలీసులు, చివరిసారిగా అతను ఎవరితో కలిసి వెళ్ళాడో తెలుసుకొని, దాని ఆధారంగా హంతకుడు స్నేహితుడు అనే గుర్తించారు. సాజిద్ ని అందులోకి తీసుకొని కేసు నమోదు చేసి జైలుకి తరలించారు.

Comments