ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

పసిపాప ను రోడ్డుపై వదిలేశారు..తరువాత కుక్కలు.. ?

మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎవరో చేసిన పాపానికి అప్పుడే పుట్టిన పసి పాపాయి ఘోరంగా మృతి చెందింది. ఎవరు వదిలేశారో తెలియదు గాని ఆ గ్రామంలోని ఓ వీధి అప్పుడే పుట్టిన పసి కందును వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వీధి కుక్కలు ఆ పసి కందును పీక్కుతిని శరీరన్నీ ఛిద్రం చేశాయి. ఆ సమయంలో ఒక్కరు కూడా లేకపోవడంతో దారుణంగా పసి పాప అవయవాలను వేరు చూశాయి . తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన అందరి హృదయాలను కదిలించింది. దీంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు గ్రామస్థులు. అయితే మరణించిన శిశువు మగబిడ్డ అని తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పసి పాప కు సంబందించిన వారిని వెతికే పనిలో పడ్డారు.

Comments