ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

నా భార్య వేరొకరితో సంబంధం పెట్టుకున్న నేను అభ్యంతరం చెప్పను అంటున్న దర్శకుడు?


భారతీయ సంప్రదాయంలో వివాహిత అనిపించుకుటే, ఇక ఆమె ఒకే వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలి అనేది ఒక విధానంగా వస్తుంది. అయితే ప్రస్తుత సమాజంలో స్త్రీ, పురుషుల సంబంధాలు మారుతూ వచ్చాయి. అలాగే వివాహ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. కలిసి ఉంటె కలదు సుఖం అనే మాటని తీసుకెళ్ళి అటక మీద పెట్టేసారు. ఇష్టం అయితే కలిసి బ్రతకడం, వీలైతే కాపురం చేయడం, వద్దనుకుంటే ఎవరికీ వారు వేరు కావడం అనే పద్ధతిని అందరు ఫాలో అవుతున్నారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఈ మధ్య సంచలన కామెంట్స్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అసలు పెళ్లి అనే పేరుతో ఆడవాళ్ళ స్వీచ్చని నియత్రించడం కరెక్ట్ కాదని అతను తన సన్నిహితుల దగ్గర అన్నట్లు వినిపిస్తుంది.

పెళ్లి అయిన తర్వాత కూడా భార్య స్థానంలో ఉన్న అమ్మాయి వేరొక వ్యక్తితో ఎ విధమైన సంబంధం పెట్టుకున్న తప్పు కాదని, ఎందుకంటే భర్త స్థానంలో ఉన్న మగాడు కూడా పరాయి స్త్రీతో సంబంధం కోరుకుంటాడు కాబట్టి అని అన్నట్లు అందరు చెప్పుకుంటున్నారు నా భార్యకి నేను ఎలాంటి కండిషన్స్ పెట్టనని, నిజంగా తాను వేరొకరితో తిరగాలి అనుకుంటే దానికి అభ్యంతరం చెప్పానని అన్నట్లు ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ దర్శకుడు నిజంగానే ఆ మాటలు అన్నాడా, లేక ఈ మధ్య అక్రమ సంబంధాల మాటున జరుగుతున్నా హత్యల మీద రియాక్ట్ అయ్యి ఆ మాటలు అన్నాడా అనే విషయం తెలియడం లేదు. అయితే ఈ కామెంట్స్ మీద ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ మాట్లాడుకుంటున్నారు.

Comments