ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఆధార్ లింక్ లేకుంటే మీ భూములు ఇక పోయినట్టే..!

ఆధార్ విషయంలో రోజుకో రూల్ తెస్తున్న కేంద్ర ప్రభుత్వం మారో కొత్త రూల్ తీసుకొచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఈ విధానంతో బడా బాబులకు, ఆక్రమాలకు పాల్పడే వారికీ దిమ్మ తిరిగినట్లయ్యింది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లకు , పాన్ కార్డులకు ఆధార్ లింక్ చేయమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆస్తులకు కూడా ఆధార్ లింక్ తప్పనిసరి అని సూచించింది. ముఖ్యంగా కొనుగోలు చేసిన ప్రతి భూములకు ఆధార్ ని అనుసంధానం చేయాలనీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేశారు.

దేశంలో భూములను డిజిటలైజేషన్ చేయాలనే నిర్ణయంతో 1950 నుంచి ఉన్న ప్రతి భూమికి లింక్ చేయాలనీ అధికారులకు నోటీసులు పంపించారు. ఈ విధానంతో ప్రభుత్వ భూములే కాకుండా ఇతర భూములు కూడా అక్రమంగా దోచుకోవడానికి వీలుండదు. ముఖ్యంగా ఆగస్టు 14వ తేదీలోగా ఆధార్, పాన్ లింక్ ను అనుసంధానం చేసుకోవాలి. లేకుంటే వాటిని బినామీ ఆస్తులుగా ప్రభుత్వం గుర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

Comments