ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

పాపం సైరాభాను ని తెలుగు ఇండస్ట్రీ పక్కన పెట్టేసిందా?

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరో సారి రుజువు అయిపొయింది. పక్క రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకి ప్రాధాన్యత ఇస్తే. మనవాళ్ళు మాత్రం ఎంత సేపు, ముంబాయ్, చెన్నై, కొచ్చి అంటూ పరుగులు పెడతారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఎదగాలని వచ్చి, తరువాత కనుమరుగైన భామ సైరాభాను, వైజాగ్ కి చెందిన ఈ అమ్మడు. కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అనుకోకుండా వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడంతో ఒక్కసారి అమ్మడికి అంత వరకు ఉన్న ఫేం కాస్తా పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు ఇచ్చేవారే కరువైపోయారు. సైరాభాను అనే హీరోయిన్ తెలుగులో ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయారు. ఈ పరిస్థితి కేవలం ఈ అమ్మాయిది మాత్రమె కాదు. తెలుగు నేలమీద పుట్టిన హీరోయిన్ అవ్వాలని అనుకునే ప్రతి అమ్మాయి పరిస్థితి ఇలానే వుంది.

Comments