ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

బోజ్ పూరీ హీరోయిన్ అంజలి శ్రీవాస్తవ అనుమానాస్పద మృతి?

రీసెంట్ గా ఓ బాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ మృతి గురించి బీ- టౌన్ మరిచిపోక ముందే మరో వర్ధమాన నటి అనుమానాస్పద మృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. కొన్ని బోజ్ పూరీ చిత్రాల్లో నటించి, బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న 29 అంజలి శ్రీవాస్తవ, అంధేరీలో తన నివాసరంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. అక్కడ వున్న స్థానికులు ఆమెని గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఆమెని క్రిందికి దించి హాస్పిటల్ కి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునే పనిలో వున్నారు. నిన్న రాత్రి నుంచి ఆమె బంధువులు అంజలికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తునారని, ఆమె ఫోన్ ఎత్తడం లేదని విషయం తెలిసింది . అదే టైంలో ఆమె ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలుస్తుంది. దీంతో ఆమెది అనుమానాస్పద మృతి క్రింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments