ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

నన్ను అన్యాయంగా ఇరికించారు – ఏ 1 శ్రవణ్

హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ తెలిపాడు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం మీడియా ప్రశ్నించడంతో స్పందించిన శ్రవణ్… ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. తాను కేవలం రాజీవ్ కు స్నేహితుడ్నని, శిరీషతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి చాలా కాలంగా స్నేహితుడు కావడంతో రాజీవ్ కు సహాయం చేసేందుకు వారితో కలిసి వెళ్లానని అన్నాడు. శిరీషను హత్య చేశారన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పాడు. తాను ఎలాంటి తప్పుచేయలేదని అన్నాడు.

Comments