ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

భూక‌బ్జాలు.. ఇదేమైనా ఆ ఇద్ద‌రు మంత్రుల స‌మ‌స్యా?


వేల కోట్ల విలువైన విశాఖ భూకుంభ కోణంలో పార్టీ నేత‌ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రికీ అర్థం కాని ఆట ఆడిస్తున్నార‌ని విమ‌ర్శిస్తోంది లోక్‌స‌త్తా పార్టీ. తేదేపా నేత‌లు, మంత్రులు ద‌గుల్బాజీ అధికారుల‌తో క‌లిసి భూదోపిడీ చేశారు.ఈ భారీ భూకుంభ‌కోణంపై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలని ముఖ్య‌మంత్రిని, రెవెన్యూ మంత్రిని డిమాండ్ చేశారు లోక్‌స‌త్తా రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ట్టాభిరామ‌య్య‌. ఈ గొడ‌వ అయ్య‌న్న‌పాత్రుడు- గంటా శ్రీ‌నివాస‌రావు సొంత స‌మ‌స్య‌లాగా త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు. రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్య‌మంత్రే ఫిర్యాదు తీసుకోక‌పోతే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు.

మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావే.. ఇందులో ఎలాంటి అవినీతి లేదు. కావాలంటే సీబీఐ ఎంక్వ‌యిరీ చేయ‌మ‌నండి అని అంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను ముఖ్య‌మంత్రి, రెవెన్యూ మంత్రులే ప‌ట్టించుకోవ‌డం లేదు. 138 మంది రైతులు స్వ‌యంగా వ‌చ్చి త‌మ భూములు క‌బ్జాకి గుర‌య్యాయ‌ని అర్జీలు ఇచ్చారు. మా భూముల్లో అడుగుపెట్ట‌లేక‌పోతున్నాం. భ‌యం వేస్తోంది. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, గూండాలు తెచ్చిన తంటా ఇద‌ని మొర‌పెట్టుకున్నారు. ఈ కేసు త‌ప్పుదారి ప‌ట్ట‌కుండా విచారించాల‌ని డిమాండ్ చేస్తున్నా. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే, హైకోర్ట్ జ‌డ్జి సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని కోరుతున్నా. 10వేల ఉత్త‌రాలు ప్ర‌జ‌ల నుంచి హైకోర్టు న్యాయ‌మూర్తికి లేఖ‌లు రాయిస్తాం… అంటూ ఫైర‌య్యారు. లోక్ స‌త్తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అడుగుతున్నాన‌ని అన్నారు.

Comments