ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఆస్ట్రేలియా గుడ్ న్యూస్ .. కేవలం భారతీయులకే !

విదేశాలలో విహార యాత్రలకు వెళ్లాలనుకునే భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యాటక దేశంగా చెప్పుకునే ఆస్ట్రేలియా ఇక నుంచి ఇండియన్స్ కు ఆన్ లైన్ లో వీసాలను దరకాస్తు చేసుకోవచ్చినని వీటన్నింటిన్నీ డిపార్ట్ మెంట్ ఇమ్మిఅకౌంట్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ మినిస్టర్ అలెక్స్ హాక్ అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.. అయితే ఈ విధానంతో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య మరింత స్నేహ సంబంధాలు పెరుగుతాయని తెలుస్తోంది.

భారతీయులు ఆస్ట్రేలియా పర్యటనను అమితంగా ఇష్టపడుతున్న నేపథ్యంలో ఈ సరికొత్త విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెబుతూ.. 2017 మొదటి నాలుగు నెలల్లో 65 వేల వీసాలను జారీ చేసిందని హాక్ తెలిపారు. దీంతో ఇండియన్స్ కి మరింత చేరువయ్యేలా 24/7 సౌకర్యం కల్పిస్తూ.. వీసా దరఖాస్తు ఛార్జిని ఎలక్ట్రిక్ పేమెంట్ చేసి, అలాగే స్టేటస్ ని ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు. అప్లై చేసిన తరువాత వెంటనే వీసాను ఆమోదిస్తామని ఆ తరువాత ఇక ప్రయాణానికి సిద్ధం కావడమేనని ఇమ్మిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ విధానం మరింత ఈజీ అవుతుందని కూడా వారు తెలిపారు.

Comments