ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ముగ్గురిని పెళ్ళిచేసుకొని… ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కంత్రీ లేడి?


ఈ జెనరేషన్ అమ్మాయిలు, అవసరాల కోసం, వారి ఆనందం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా వున్నారని చెప్పడానికి తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన చెప్పొచ్చు. అసలు వివరాల్లోకి వెళ్తే. మహిత అనే ఓ వివాహిత గుంటూరులో ఓ రహదారిలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ దారిలో వెళ్తున్న కొంత మంది ఆమెను చూసి 108కి, పోలీసులకి ఫిర్యాదు చేసారు. వాళ్ళు ఆమెని హాస్పిటల్ కి తరలించారు. ఆపై ఆమె వివరాలు తెలుసుకొని విచారించిన పోలీసులకి ఆమె గురించి విస్తుపోయే నిజాలు తెలిసాయి. పాత గుంటూరుకి చెందిన మహిత కి 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఒక కూతురు కూడా వుంది. అయితే రెండేళ్ళ తర్వాత అతన్ని వదిలేసి మరో యువకుడుని పెళ్లి చేసుకుంది. అతనితో కాపురం చేసిన రెండేళ్ళ తర్వాత, మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని రెండోవాడిని వదిలేసింది. అతనితో ఉంటూనే ఒకరికి తెలియకుండా ఒకరుగా ముగ్గురు యువకులతో సంబంధం పెట్టుకుంది. వాళ్ళు ఏడాది క్రితం ఆమెను వదిలించుకున్నారు. తరువాత మూడో భర్త దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది. అతను ఇవ్వకపోయే సరికి పెద్ద డ్రామా ప్లే చేసి ఆత్మహత్యాయత్నంకి ప్రయత్నించింది. ఈ విషయం ఆమె బంధువులు పోలీసులకి తెలపడంతో ఆమె బండారం అంతా బయట పడింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Comments