ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

ఆంధ్రాలో రాజకీయ వ్యభిచారం నడుస్తుందా?


భారత రాజకీయాలు భ్రష్టు పట్టాయని ప్రస్తుతం వ్యవస్థని చూస్తున్న ప్రతి ఒక్కరు కచ్చితంగా చెబుతారు. అధికారం పార్టీ మీద దాడి చేయడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చూసే ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెడుతూ పెద్ద రాద్దాంతం చేస్తూ వుంటారు. ఇలాంటి నీచమైన రాజకీయం ఆంధ్రాలో ఈ మధ్య కాలం మరీ ఎక్కువగా తయారైంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ పరిపాలన పక్కన పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వైసీపీ పార్టీ అధికారంలో వున్న చంద్రబాబు పరిపాలన మీద ప్రజల్లో ఎలా వ్యతిరేకత తీసుకురావాల అనే ప్రయత్నంలో వుంటే, ఎలా అయిన ఈ సారి కూడా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ వున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇంత వరకు ఒకే అనిపించుకున్న ఇప్పుడు రాజకీయ నాయకులు విమర్శలు హద్దులు దాటిపోయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయాయి. అలాగే అధికారంలో వున్న టీడీపీ నాయకులు తమకు హద్దు లేదు అన్నట్లు ఉన్నపళంగా భూములు దోసుస్తూ వారు చేసే పనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని భూములు, కాల్ మనీ, ఇప్పుడు వైజాగ్ భూ కుంభకోణం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీటిలో చాలా మంది టీడీపీ నాయకుల హస్తం వున్నదని చాలా మందికి తెలుసు కాని అధికార చేతిలో వుంది కాబట్టి ఎలాగోలా వాటిలో తమ నాయకుల పాత్ర బయటకు రాకుండా ఆపేస్తున్నారు. అలాగే వైసీపీ కూడా కొన్ని సందర్భాల్లో అధికార పార్టీతో లోపాయకారి ఉప్పందాలు చేసుకుంటూ నేరాల నుంచి తప్పించుకుంటూ బయటకు మాత్రం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.

దీనిపై రాజకీయ విశ్లేషకుల మాట మరోలా వుంది. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని సక్రమ మార్గంలో నడిపించే పార్టీలు గాని, నాయకులుగాని లేరని వారు చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయం ఓ రకమైన వ్యభిచారంగా తయారైందని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎందుకు జనం మధ్యకి వస్తారో, ఈ విషయం మీద ఆందోళన చేస్తారో అర్ధం కాని పరిస్థితిలో ప్రజలు వున్నారని అంటున్నారు. అసలు ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద, ప్రజల కోసం పోరాటం చేయాల్సిన వాళ్ళు, అనవసర విషయాల మీద ఆందోళనలు, నిరసన దీక్షలు చేయడం ఏమిటో అర్ధం కాని విధంగా వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నీచ రాజకీయాలు ఎప్పటికి మారుతాయో అర్ధం కాని విధంగా వుందని విశ్లేషకులు, సీనియర్ రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments