ప్రచురణ తేదీ : Mon, May 29th, 2017

అమెరికా చర్చిలో ఆంధ్ర అబ్బాయి సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ..!


ప్రేమకు కులమతాలే కాదు దేశాల హద్దులు కూడా ఏమాత్రం అడ్డు కాదని పలు మార్లు నిరూపితమైంది.కృష్ణ జిల్లా వెంట్రప్రగడ గ్రామానికి చెందిన అమెరికా యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అమెరికాలోని చర్చిలో జరిగిన వీరి ప్రేమకథ ఆసక్తిని కలిగిస్తోంది. గ్రామానికి చెందిన పాస్టర్ మీసాల సుందరరావు, కుమారి ల మొదటి కొడుకు విజయ శాస్త్రి. బైబిల్ లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు అతడు అమెరికా వెళ్లాడు.

విజయశాస్త్రికి తరచుగా చర్చికి వెళ్లే అలవాటు ఉంది. చర్చిలో అచిగాయల్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. తరచుగా వారు చర్చిలో కలుసుకోవడం వలన స్నేహితులుగా మారారు. కొంత కాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. అమెరికాకు చెందిన కయల్, షారన్ ల చైనా కుమార్తె అచిగాయల్. వీరిద్దరూ పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకోవడంతో పెద్దల అంగీకారాన్ని కోరారు.ఇరుకుటుంబాల వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటీవలే వీరి వివాహం కృష్ణా జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం జిల్లాలో ఆసక్తిగా మారింది.వీరి వివాహానికి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హాజరు కావడం విశేషం.

Comments