ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ఆమె చరిత్ర అద్భుతమైన సినిమా కథ..!


కొందరి జీవిత చరిత్రని వెండితెరపై సినిమాగా మలిస్తే అద్భుత విజయం సాధిస్తుంది. ఈ మధ్య కాలంలో వెండి తెరపై గొప్పవారి జీవిత చరిత్రలు బయోపిక్ లుగా వస్తున్నాయి. కాగా వరంగల్ అర్బన్ కలెక్టర్ అయిన ఆమ్రపాలి జీవిత చరిత్ర అద్భుతమైన సినిమా కథ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అభిప్రాయం పడ్డారు. ఓ కార్యక్రమంలో అమ్రపాలితో కలసి పాల్గొన్న ఆయన ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఓరుగల్ల కళా వైభవం కార్యక్రమంలో భాగంగా షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ లో ఆయన, కలెక్టర్ అమ్రపాలితో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హీరో నవదీప్ తదితరులు పాల్గొన్నారు. కాలుకు గజ్జె కట్టాలన్న, అందమైన పాట రాయాలన్నా, ఆదర్శవంత మైన రాజకీయం చేయాలన్నా, చదువులో రాణించాలన్నా వరంగల్ కే సాధ్యమని ఎస్వీ కృష్ణారెడ్డి అభిప్రాయ పడ్డారు. వరంగల్ లో ఉన్న మంచి సినిమా కథ ఆమ్రపాలి జీవిత చరిత్ర అని అన్నారు. ఆమె లాగా అందరూ అద్భుతాలు చేయడానికి సిద్ధం కావాలని అన్నారు.

Comments