ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

హీరో అనిపించుకోవడంలో కిక్ లేదు అంటున్న ఆది పినిశెట్టి?


ఆది పినిశెట్టి హీరోగా తెలుగు లో ఒక విచిత్రం సినిమాతో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే అతనికి తెలుగులో హీరోగా గుర్తింపు రాలేదు. కాని తమిళనాడులో మాత్రం హీరోగా మంచి గుర్తింపే వచ్చింది. అక్కడ తమిళ ప్రేక్షకులు ఆది పినిశెట్టిని విశేషంగ ఆకట్టుకున్నాడు. అయితే ఎంతైనా తెలుగువాడైన ఆదికి, ఇక్కడ రాణించాలనే ఆశ ఉంటుంది. హీరోగా గుర్తింపు రాకున్న సరైనోడు సినిమాతో విలన్ మంచి ఇమేజ్ ని ఆది సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో ఇప్పుడు, రంగస్థలం, పవన్- త్రివిక్రమ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే నాని హీరోగా వస్తున్నా నిన్ను కోరి సినిమాలో కూడా కీలకమైన పాత్ర చేసాడు. దీనిపై నాని మాట్లాడుతూ నేను హీరో అనిపించుకోవాలని ఇండస్ట్రీలోకి అస్సలు రాలేదు. ఒక నటుడుగా నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నా. దాని కోసం నా టాలెంట్ నిరూపించుకునే చాలెజింగ్ పాత్రలు వస్తే అది, హీరో, విలన్, మరొకటి అని మాత్రం చూడను కచ్చితంగా చేస్తా అని అంటున్నాడు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాడు.

Comments