ప్రచురణ తేదీ : Wed, Apr 12th, 2017

ఈ సుందరి పదో తరగతి అయిపోగానే అబ్బాయిలను ఏం చేసిందో తెలుసా.. ?


మారుతున్న కాలానికి అనుగుణంగా అబ్బాయిలు ఎంత మారుతున్నారో తెలియదు గాని అమ్మాయిలు మాత్రం తెగ మారిపోతున్నారు. ప్రతి విశయంలో అబ్బాయిలతో పోటీ పడుతూ తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా చదువులో తమ స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు స్వేచ్ఛను ఇవ్వడంలో తల్లితండ్రులు కూడా మక్కువ చూపుతున్నారు. కానీ కొందరి అమ్మాయిల అత్యుత్సాహం వల్ల ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ మళ్లీ అమ్మాయిలను నిర్బందించే స్థాయికి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అబ్బాయిలు డబ్బుకు ఆశపడి మోసాలకు పాల్పడుతున్న ఘటనలను ఎన్నో వచ్చాయి. ఇలాంటి తరహాలోనే అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారని కూడా వార్తల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరహాలోనే ఈ మధ్య ఓ ఘటన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో వెలువడింది. చిత్తూరు జిల్లాకు చెందిన యువతీ పెళ్లి కానీ యువకులను మోసం చేస్తూ పోలీసులకు పట్టుబడింది.

పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి గ్రామానికి చెందిన శ్రీలత పదవ తరగతి పూర్తీ చేసింది. ఆ తర్వాత ఈజీ గా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడి మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. బెంగుళూరులో ఉంటూ పెళ్లికాని యువకులను టార్గెట్ చేస్తూ తన ఆలోచనలతో వారి నుంచి డబ్బు గుంజడం మొదలు పెట్టింది. తన దగ్గర కోట్ల ఆస్తులున్నట్టు తన తండ్రి ఒక వ్యాపారి అని మాయమాటలు చెప్పి శ్రీలత మ్యాట్రీమోనిలో ఒక అందమైన అమ్మాయి ఫోటోను జత చేసింది. అంతే కాకుండా తన పేరు సుస్మితా అంటూ ఫెక్ వివరాలను తెలియజేశింది. అయితే వీటిని చూసి మోసపోయిన కొందరు యువకులు ఆమె మాయమాటలు నమ్మి డబ్బును కూడా ఇచ్చారంట. ఇప్పటివరకు ఈ మాయలేడి 6 లక్షలు స్వాహా చేసిందని తెలిసింది. అంతే కాకుండా తన తండ్రి సింగపూర్‌ నుంచి డాలర్లు పంపించాడని.వాటిని మార్చుకునేందుకు రూ.50 వేలు పంపిస్తే మళ్లీ తిరిగి నీ అకౌంట్ కి పంపుతానంటూ కొన్ని లక్షలు తన ఖాతాలోకి వేయించుకుంది. సరిగ్గా పెళ్లిచూపుల తేదీకి ముందురోజు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుంది. ఈ విధంగా మొసైపోయిన ఓ యువకుడు ఏమి చెయ్యాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసును నమోదు చేసుకొని యువతీ గురించి విచారణ జరపగా ఈ దారుణాలు వెలువడ్డాయని వారు తెలిపారు.

Comments