ప్రచురణ తేదీ : Sat, Apr 22nd, 2017

కత్తితో దాడి చేశాడు.. ఆ తర్వాత ఆమె చనిపోతుందేమో అనుకోని ఆ పని చేశాడు.


ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో భార్య భర్తలకు జరిగిన ఓ గొడవ తీవ్ర దుమారాన్ని రేపింది. కట్టుకున్న భర్తే ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. అంతే కాకుండా కత్తితో దాడి చేసి ఇంటి బయటకు నెట్టి వేశాడు. ప్రస్తుతం ఆ మహిళ 5 నెలల గర్భిణీ. అయితే తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళా హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతుంది. దీంతో ఆమె ఎక్కడ చనిపోతుందో అని దాడి చేసిన కత్తితోనే ఆ సైకో తన గొంతు కోసుకున్నాడు. అయితే అతని పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మీడియాకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం. బుర్ర మహేష్‌(26) ,ప్రియాంక(22)తో 8 నెలల క్రితం అట్టహాసంగా పెళ్లైంది. అయితే ఈ మద్యే గర్భం దాల్చిన భార్యను మహేష్ అసభ్యకర పదజాలంతో దూషిస్తూ నీకు వచ్చిన గర్భం నా వల్ల రాలేదని గొడవకు దిగాడు. ఆ మాటలు భరించలేక ప్రియాంక భర్తతో వారించింది. దీంతో మహేష్ కోపంతో పక్కనే ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె కోన ఊపిరితో కొట్టుకుంటుండగా బంధువులు హాస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ ను కోలుకున్నాక విచారిస్తామని చెప్పారు.

Comments