ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

తెలంగాణ‌లో భారీ కొలువుల జాత‌ర‌

ఉద్యోగాల కోసం ఆవురావురుమ‌ని ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. అయితే ఏఏ విభాగాల్లో రిక్రూట్ మెంట్ ఎలా ఉంటుంది? అన్న‌ది ప‌రిశీలిస్తే…

సీసీఎల్ఏ కార్యలయంలో జూనియర్ అసిస్టెంట్లు 21, డిప్యూటీ కలెక్టర్లు 8, డిప్యూటీ తహసీల్దార్లు 38, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు 400, వీఆర్వోలు 700, వీఆర్ఏలు 1000, డిప్యూటీ సర్వేయర్లు 100, కంప్యూటర్ డ్రాప్ట్స్ మెన్ 50, జిల్లా రిజిస్థార్లు 7,
సబ్ రిజిస్థార్లు 22, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు 50, స‌ర్వేయర్ల 110 పోస్టులు రిక్రూట్ చేయ‌నున్నారు. రెవెన్యూ శాఖ‌లో ఉద్యోగం కావాల‌నుకున్న‌వారికి ఇది నిజంగానే జాక్ పాట్ సీజ‌న్‌.

Comments