ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

యువీ రిటర్న్స్ ..ఇంగ్లాండ్ తో వన్డే, టి 20 లకు టీం ఇండియా ఎంపిక..!

UV
యువరాజ్ సింగ్ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరగబోయో వన్డే, టి 20 లకు సెలెక్టర్ లు యువీకి తిరిగి జట్టులో చోటు కల్పించారు. ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ తో జరగబోయో వన్డే, టి 20 లకు భారత జట్టుని ప్రకటించింది.గతం లో జరిగిన రంజీ మ్యాచ్ లలో యువీ సత్తా చాటాడు. అనంతరం డిసెంబర్ లో యువరాజ్ తన ప్రేయసి హేజల్ కీచ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.తాను తిరిగి జట్టులో పునరాగమనం చేస్తానని కోహ్లీ ధీమాని వ్యక్తం చేసాడు.

కాగా ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అందరూ ఊహించిన విధంగానే జట్టు పగ్గాలను సెలెక్టర్లు కోహ్లీకి అప్పగించారు.వన్డే, టి 20 రెండు ఫార్మాట్లకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా ధోని జట్టులో సాధారణ ఆటగాడిగా ఉంటాడు. కాగా టి 20 లలో చోటు దక్కించుకున్న రైనా కు వన్డేల్లో చోటు దక్కలేదు.

వన్డే జట్టు వివరాలు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌.

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్ ), ఎంఎస్‌ ధోని (వికెట్ కీపర్), మన్‌దీప్‌, కేఎల్‌ రాహుల్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రిషబ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా

Comments